పద్మ శ్రీ ఆర్ట్స్ సంస్థ, ప్రముఖ నాటక రచయత, దర్శకులు కళాదిత్య బిరుదాంకితులు, మా నాన్న శ్రీ బెల్లంకొండ రత్నం గారిచే స్థాపించబడినది .
పద్మ శ్రీ ఆర్ట్స్ - బెల్లంకొండ రత్నం గారి రచనల గురించి...
- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోలియో, పౌష్టికాహారం, లలిత గేయాలు, దూరదర్శన్, ఆకాశవాణిలలో ప్రసారమయినవి.
- 1994లో సారాసుర సం హారం గేయనాటికను ప్రభుత్వ సహకారముతో సారా వ్యతిరేక ఉధ్యమంలో అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.
- పరిశుభ్రత-పచ్చదనం, బ్రతకండి బ్రతకనివ్వండి గీతాలు పుస్తకాలుగా ముద్రించి స్థానికముగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకి ఉచితముగ సరఫరా చేసి, వాటిలో సంగీత నృత్య పోటీలు నిర్వహించడమైనది.
- 2002 రాష్ట్ర నంది నాటక పోటీలలో పాల్గొని దర్పణం నాటికను స్వీయ దర్శకత్వంలో 2003 మే, 30న రవీంద్రభారతి, హైదెరాబాదులో విజయవంతముగా ప్రదర్శించబడినది.
- శుచి-శుభ్రత కార్యక్రమం పై గీతాలు రచించి,రికార్డు చేయించి ప్రభుత్వమునకు ఇవ్వడమైనది.
- 2015, ఫిబ్రవరి,మార్చి 2014లో జరిగిన అభినయ ఆర్ట్స్ వారి హనుమ, శ్రీ వేంకటేశ్వర నాట్యకళాపరిషత్ వారి గరుడ జాతీయ నాటక పోటీలలో అన్నమ్మాచార్య నాటకమును స్వీయ దర్శకత్వములో ప్రదర్శించి ఉత్తమ రచన, ఉత్తమ రంగాలంకరణ, ఉత్తమ బాల నటుడి అభినందన ప్రసంశాపురస్కారాలను పొందడమైనది.తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆర్థిక సహాయముతో అన్నమాచార్య నాటకమును పుస్తకముగా ముద్రించడమైనది.
- 2015లో స్వచ్ఛ భారత్-స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ పై పాటలను రికార్డు చేయించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి బహూకరించడం జరిగింది.
- పద్మ శ్రీ ఆర్ట్స్ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా స్వీయ దర్శకత్వంలో పలు పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలను ప్రదర్సించి ప్రధాన పాత్రలు పోషిండమైనది. నటుడిగ శ్రీ కృష్ణుడు, సుయోధనుడు, రావణాసురుడు, చాణిక్యుడు, చంద్రగుప్తుడు, జయసింహ, సారాసురుడు మరి కొన్ని సాంఘిక పాత్రలు మంచి గుర్తింపును తెచ్చాయి.
ఈతరంలో మా నాన్నలా కాకపొయినా అందులో పదొవంతుకి చేరుకోవడానికి మ అన్నయ్యా, నేనూ మావంతు ప్రయత్నం చేస్తున్నాం.
మ అన్నయ్య శ్రీ బెల్లంకొండ శ్రీకాంత్ గారి బ్లాగుని వీక్షించండి.
బ్లాగు: భావ-నిక్షిప్త
నా పేరు బెల్లంకొండ ఙ్ఞాన ప్రకాష్. పూర్తి వివరాలు త్వరలో ...

